Pages

Wednesday, February 28, 2024

PM SURYODAYA YOJANA



< /div>
Rooftop Solar Scheme: మధ్యతరగతి వర్గానికి ఊరట కల్పించే దిశగా కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో చిన్న చిన్న ప్రకటనలు చేసింది. దీంట్లో అద్దె ఇళ్లు సహా మురికివాడలు వంటి చోట నివసించే వారికి సరసమైన ధరల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొత్త హౌసింగ్ పథకం తీసుకురానున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన రానుంది. ఇదే సమయంలో సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి. దీంతో విద్యుత్ బిల్లుల భారం నుంచి తప్పించుకోవచ్చు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్స్ వరకు ఫ్రీ విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్ సోలారైజేషన్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకంతో గృహ వినియోగదారులకు ప్రతి సంవత్సరం రూ. 15 వేల నుంచి రూ. 18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు నిర్మలమ్మ. ఈ పథకం గురించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సమయంలోనే ప్రకటించారు. ఇదే ప్రధాన్ మంత్రి సూర్యోదయ్ యోజన. దీంట్లో భాగంగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ రంగ సంస్థ REC .. ఈ స్కీమ్ నిర్వహణ సంస్థగా ఉంటుంది. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం 1.2 ట్రిలియన్ డాలర్లు రుణం ఇవ్వనుంది. ఇదివరకే సోలార్ రూఫ్ టాప్ కింద విద్యుత్తు పొందే గృహాలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్లేట్లు అమర్చుకునేందుకు అయ్యే ఖర్చులో సబ్సిడీ కూడా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఇంటికి కూడా సోలార్ ఇన్‌స్టాలేషన్ లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పుడు కోటి ఇళ్లకు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్ ప్రకటించింది.
 

No comments:

Post a Comment

Please Leave Your Valube Comments Here