Andhra Pradesh Graduate Mlc Election Voters Registration: ఏపీలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం-విజయనగరం- విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాల్లో పేర్ల నమోదుకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సందడి మొదలుకాబోతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన
చేసింది. కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రులు.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ
నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
ప్రకటన విడుదల చేశారు.ఈ మేరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబరు 30న నోటీసు.. నవంబరు 6
వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నవంబరు 23న
ముసాయిదా జాబితా ప్రచురిస్తారు.
ఆ తర్వాత నవంబరు 9 వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబరు 30న ఎమ్మెల్సీ ఎన్నికలకు
సంబంధించిన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు.వచ్చే ఏడాది మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-
పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు , ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల
పదవీకాలం ముగియనుంది. అలాగే ఈ నెల 29న తూర్పు-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల
నమోదుకు నోటీసు జారీ చేస్తారు. సెప్టెంబరు 3 వరకూ దరఖాస్తులు స్వీకరించి..నవంబరు 6న తుది జాబితా
ప్రచురిస్తారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో..
వారంతా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ నమోదు చేయడం అనేది ఓటరు ఇష్టమని క్లారిటీ
ఇచ్చారు. మార్చిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా
రూపొందిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల
వెంకటేశ్వరరావు పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని తెలిపారు.
Leave your comments below!
Follow Us for Latest Job Notifications, Educational Notifications, and Govt. Schemes Below
RRB, IBPS, SSC, Defence Jobs, and other Central Govt. Jobs, Andhra Pradesh State Govt. Jobs, and State and Central Govt. Schemes, Educational Institutes updates Instantly received, Updates provided by Kanaka Durga Communications
Leave your comments below!
Follow Us for Online Deals and Offers
Amazon India, Flipkart, Myntra, Meesho, Ajio, Shopsy, Pepperfry, MyGlamm, etc., and many more Deals and Offers provided by Kanaka Durga Communications
No comments:
Post a Comment
Please Leave Your Valube Comments Here